calender_icon.png 26 July, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

23-07-2025 12:00:00 AM

రామచంద్రపురం, జూలై 22 : తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో నూతన రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు గ్లోసం హైట్స్ అపార్ట్మెంట్ నుండి రింగురోడ్డు వరకు 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, సీనియర్ నాయకులు సోమిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.