calender_icon.png 25 July, 2025 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండగ వాతావరణంలో రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలి

23-07-2025 12:00:00 AM

25 నుండి ప్రారంభం: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, జూలై 22(విజయక్రాంతి): ఈనెల 25 నుండి ఆగస్టు 10 వరకు జిల్లాలోని  అన్ని మండల కేంద్రాల్లో పండుగ వాతావరణంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి పటిష్ట కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, భూభారతి, వివిధ రెసిడెన్షియల్ స్కూళ్లలో భోజన, మౌలిక వసతుల ఏర్పాటు, వనమహోత్సవంలో మొక్కలు నాటడం,మహాలక్ష్మి పథకం తదితర  అంశాలపై కలెక్టర్ సమీక్ష చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల పురోగతిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని తెలిపారు. ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని, క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేసేందుకు లక్ష్యాలకు అనుగుణంగా నిర్విరామంగా కృషి చేయాలన్నారు. వన మహోత్సవ కార్యక్రమాన్నివేగం పెంచి ప్రత్యేక కార్యాచరణ ద్వారా 15 రోజుల్లో పూర్తిస్థాయిలో లక్ష్యాన్ని సాధించాలన్నారు.

వనమహోత్సవం టార్గెట్ పూర్తి అయిన దగ్గర జియో టాకింగ్ తప్పనిసరి అని తెలిపారు.  హాస్టల్స్ రెసిడెన్షియల్ పాఠశాలను ప్రత్యేక ప్రణాళిక ద్వారా అధికారులు సందర్శించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ సంక్షేమ పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనపై  క్షేత్రస్థాయిలో సంక్షేమ శాఖ అధికారులు పాఠశాలను సందర్శించి మరుగుదొడ్ల నిర్మాణంపై  ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు.

డెంగ్యూ మలేరియా జ్వరాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు, పౌరసరఫరాల శాఖ ద్వారా సిఎంఆర్ డెలివరీ విషయంలో మిల్లర్లకు ప్రత్యేక ఆదేశాలు ఇస్తూ ఈనెల 27 లోపు పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఎఫ్‌ఓ జోజి,

ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్ రెడ్డి, డిఆర్డిఓ శ్రీనివాసరావు, డిఎంహెచ్వో డాక్టర్ శ్రీరామ్, విద్యాశాఖ అధికారి రాధా కిషన్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఎస్సీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, మైనారిటీ సంక్షేమ అధికారి జమ్లా  నాయక్, ఇంటర్మీడియట్ అధికారి మాధవి, జిల్లా పౌరసరఫరాధికారి నిత్యానంద్, హౌసింగ్ పీడీ మాణిక్యం, సంబంధిత ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.