calender_icon.png 18 November, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం

18-11-2025 12:00:00 AM

చర్ల, నవంబర్ 17 (విజయక్రాంతి) : మండలం కుదునూరు మరియు సత్యనారాయణ పురం మరియు చర్ల మరియు మేడివాయ మరియు గోమ్మగూడెం గ్రామంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు,రైతులు, మండల అధికారులు, మండల నాయకులు సమన్వయంతో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతే రాజు అన్న నినాదంతో రైతు కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వెంటనే అధికారులు తీసుకొవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని పరిశీలించారు, చర్ల మండలం లో ఎటువంటి అవకతవకలు జరగకుండా అధికారులు చూసుకోవాలని , రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు అనంతరం అనంతరం కలివేరు గ్రామంలో మరియు చర్ల గ్రామంలో కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం నందు అన్నప్రసాద కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం ప్రజలకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, మండల నాయకులు కలిసి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కి శాలువాతో సన్మానించారు,వీరి వెంట మండల తాసిల్దార్ శ్రీనివాస్ , నలపు దుర్గాప్రసాద్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి, మండల అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.