01-09-2024 04:02:40 PM
నకిరేకల్: రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నకిరేకల్ పట్టణంలోని వివిధ వార్డుల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎవరూ కూడా బయటకు రావద్దనీ.. వరద నీరు విపరీతంగా వస్తున్న నేపథ్యంలో చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని పర్యవేక్షించాలని తెలిపారు. నియెజకవర్గ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అత్యవసర సమయాల్లో ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందిని సంప్రదించవచ్చని సూచించారు.