18 April, 2026 | 4:02 PM

Breaking News

కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి   •   మహిళా రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ ది వక్రబుద్ధి   •   ఇందిరా క్రాంతి వివోఏలకు ఉద్యమం రిజిస్ట్రేషన్ పై అవగాహన   •   మినీ గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ   •   మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •  

ఘనంగా వివేక్ దంపతుల పెళ్లిరోజు వేడుకలు

06-06-2025 06:00 PM

మందమర్రి,(విజయక్రాంతి): చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి- రమాదేవి దంపతుల వివాహ వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్ ఏరియాలో కాంగ్రెస్ నాయకులు పైడిమల్ల  నర్సింగ్ ఆధ్వర్యంలో శుక్రవారం దంపతుల వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింగ్ మాట్లాడుతూ... చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి వివేక్ వెంకటస్వామి నిర్విరామంగా కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనతి కాలంలోనే కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి చెన్నూర్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన సేవలను కొనియాడారు. వివేక్ దంపతులు మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ కలకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నర్సింగ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.