calender_icon.png 28 September, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీడీఏ గిరిజన సంక్షేమ అధికారి మన్నెమ్మకు పదోన్నతి

28-09-2025 12:07:03 AM

అభినందించిన ఉద్యోగులు

భద్రాచలం,(విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం భద్రాచలంలో డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న మణెమ్మకు జాయింట్ డైరెక్టర్ గా ఉద్యోగొన్నతి పొంది హైదరాబాదులోని గిరిజన సంక్షేమ కమిషనర్ కార్యాలయంలోని ప్లానింగ్ విభాగంలో జాయిన్ అయ్యారు. ఈ నెల 30న పదవీ విరమణ పొందుతున్న జెడి మణెమ్మను ఏటీడీఓ అశోక్ కుమార్, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం జెడి మణెమ్మ మాట్లాడుతూ... 1991వ సంవత్సరంలో వార్డెన్ గా ఉద్యోగంలో చేరి వివిధ జిల్లాలలో ఏటీడీవోగా పనిచేస్తూ నూతనంగా జిల్లాలు ఏర్పడిన సమయంలో కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ లో డిడి ట్రైబల్ వెల్ఫేర్ గా విధులలో చేరడం జరిగిందని, 28 జూలై 2023 నాడు భద్రాచలంలోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ గా రావడం జరిగిందని, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు జాయిన్ డైరెక్టర్గా ఉద్యోగోన్నతి పొంది 22 సెప్టెంబర్ నాడు కమిషనర్ కార్యాలయం హైదరాబాదులో విధులలో చేరడం జరిగిందన్నారు.