28-09-2025 12:02:13 AM
ములకలపల్లి,(విజయక్రాంతి): అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదేశాల మేరకు ములకలపల్లి మండలానికి ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఐటీడీఏ ద్వారా మంజూరైన ఇందిరమ్మ గృహాల ప్రొసీడింగ్ పట్టాలను శనివారం మండలంలో పంపిణీ చేశారు. సీతారాంపురం, ములకలపల్లి, మూకమామిడి, జగన్నాధపురం, పాత గంగారంతో పాటు మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో ఈ ప్రొసీడింగ్స్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.