calender_icon.png 28 September, 2025 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను భావితరాలకు అందించాలి

27-09-2025 11:35:41 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): దేశం కోసం అహర్నిశలు శ్రమించిన మహనీయుల జీవిత చరిత్రలను భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, పద్మశాలి సేవా సంఘం, బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆసిఫాబాద్ జిల్లా వాసి కావడం గర్వకారణమని తెలిపారు. తెలంగాణ తొలి దశ, మలిదస ఉద్యమాలలో పాల్గొని రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి స్వశక్తితో ఎదిగిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చూపిన పోరాట పటిమ మరువలేనిదని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆసిఫాబాద్ నియోజకవర్గానికి తొలి శాసనసభ్యులుగా పనిచేశారని, తెలంగాణ సాధనలో ఉద్యమించారని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.