10-07-2025 10:47:27 PM
ఆలయాలలో భక్తుల సందడి..
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో గురు పౌర్ణమి సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని నెమలి శిరిడి సాయిబాబా ఆలయంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి(State Agricultural Advisor Pocharam Srinivas Reddy) దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాన్స్వాడ నియోజకవర్గంలోని పలు ఆలయాలలో గురు పౌర్ణమి ఘనంగా నిర్వహించారు.
బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నసురుల్లాబాద్ మండలం నెమ్లి సాయిబాబా ఆలయం, కల్కి చెరువు వద్ద సాయిబాబా ఆలయం, బాన్సువాడ పట్టణంలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలో నిర్వహించారు. అనంతరం గురువులు, శారద ఉపాసకులు శ్రీ శ్రీ శ్రీ మంగళ గిరి నరసింహ మూర్తి మాట్లాడుతూ, ఒకప్పటి బానిస వాడ నేడు భక్తుల వాడగా వెలిసిందని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు.