calender_icon.png 11 July, 2025 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దమ్మతల్లిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శ్రీమతి..

10-07-2025 10:50:16 PM

కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కెపి జగన్నాధపురంలో గల శ్రీ కనకదుర్గ దేవస్థానము (పెద్దమ్మగుడి)లో పెద్దమ్మతల్లి గురువారం సాయంత్రం ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం వేదపండితులు అర్చకులు, ఆశీర్వచనంతో పాటు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదంను అందించారు. ఈ కార్యక్రమలలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి, ఎన్. రజనీకుమారి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.