calender_icon.png 4 August, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడిచిన పదేళ్లలో మానుకోట ప్రజల ఆకాంక్షలు నేరవేరలేదు

05-12-2024 11:24:39 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): గడిచిన పదేళ్లలో మానుకోట ప్రజల ఆకాంక్షలు నేరవేరలేదని గత వైఫల్యాలు సరిదిద్దుకుంటూ ప్రజా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మానుకోట ఎమ్మెల్యే భూక్య మురిళినాయక్ అన్నారు. ప్రజా పాలనప్రజా విజయోత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా నెల్లికూదురు మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్యెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో మానుకోట ప్రజల ఆకాంక్షలు నేరవేరలేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో చేసిన పనులను గమనిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఆలోచనలతో ముందుకు వెళతామో అర్ధమవుతుందని అన్నారు. ఈ మహబూబాబాద్ సమాజమే మా కుటుంబం అని మా కుటుంబం అని భావించి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోపే 50వేలకు పైగా ఉద్యోగ నియమాకాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు రైతు సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో ప్రక్రియ ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పథకాలు అమలు చేస్తున్నామని మహాలక్ష్మి, ఉచిత గ్యాస్, ఉచిత విద్యుత్, రైతులకు రెండు లక్షల రుణమాఫీ సన్న వడ్లకు 500 బోనస ఇలా చెప్పుకుంటుపోతే అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు, మండల అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు.