calender_icon.png 3 August, 2025 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘డిస్నీల్యాండ్’లో ఘనంగా మాక్ పోలింగ్

25-07-2025 01:28:26 AM

హనుమకొండ, జూలై 24 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్‌లోని డిస్నీల్యాండ్ ఈ- టెక్నో ఉన్నత పాఠశాలలో గురువారం ఘనంగా మాక్ పోలింగ్ నిర్వహించారు. పాఠశాలలోని మొత్తం 850 విద్యార్థులు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గర్ల్స్ స్కూల్ పుపిల్ లీడర్ పదవి కోసం ఆరుగురు, బాయ్స్ స్కూల్ పుపిల్ లీడర్ పదవి కోసం ఆరుగురు, గర్ల్స్ డిప్యూటీ స్కూల్ పుపిల్ లీడర్ కోసం ఐదుగురు, బాయ్స్ డిప్యూటీ స్కూల్ పుపిల్ లీడర్ కోసం ఆరుగురు విద్యార్థులు పోటీలో నిలబడ్డారు.

ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో బాయ్స్ స్కూల్ పుపిల్ లీడర్‌గా బి.హృతిక్ 10వ తరగతి తన సమీప ప్రత్యర్థి ఎం.జశ్వంత్ 10వ తరగతిపై 67 ఓట్ల ఆధిక్యతతో విజయాన్ని సాధించాడు. గర్ల్ స్కూల్ పుపిల్ లీడర్‌గా బి.మధుశ్రీ 10వ తరగతి తన సమీప ప్రత్యర్థి ఎం.అర్చన 10వ తరగతిపై 29 ఓట్ల అధిక్యతతో విజయాన్ని సాధించినది.

బాయ్స్ డిప్యూటీ స్కూల్ పుపిల్ లీడర్‌గా డి.రామ్ చరణ్ 9వ తరగతి తన సమీప అభ్యర్థి పి.అర్జున్ 9వ తరగతిపై 86 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. గర్ల్ డిప్యూటీ స్కూల్ పుపిల్ లీడర్ పదవికి ఇ.చరణి 9వ తరగతి తన సమీప అభ్యర్థి అనన్య రెడ్డి 9వ తరగతి పై 5 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. విజేతలకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేశారు.

విజేతలుగా నిలిచిన విద్యార్థులచే పాఠశాల ఫౌండర్స్ డి మల్లయ్య, డి సదయ్య, బి లక్ష్మీనివాసం, డైరెక్టర్లు శోభారాణి, డి రాకేష్ భాను, డి దినేష్ చందర్, కావ్య, మీన ప్రమాణ స్వీకారం చేయించారు. అభినందన సభలో పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువ ఉంటుందని తెలిపారు. నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోషల్ ఉపాధ్యాయులు రతన్ సింగ్, రాజ్ కుమార్, పాషా, విజయ్ కుమార్, సురేందర్ పాల్గొన్నారు.