calender_icon.png 19 May, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెన్నయ్య కుట్రల వెనుక మందకృష్ణ హస్తం

19-05-2025 12:00:00 AM

ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి

ముషీరాబాద్, మే 18 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో చెన్నయ్య వేసిన కేసు వెనక మందకృష్ణ మాదిగ హస్తం ఉందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆరోపించారు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిడమర్తి రవి మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 9 శాతం రిజర్వేషన్ కల్పించి వర్గీకరణ అమలు చేస్తున్న సందర్భంలో 5 శాతం కూడా లేని సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం రిజర్వేషన్ కల్పించగా దాన్ని ఓర్వలేని మాల మహానాడు అధ్యక్షులు చెన్నయ్య ఎస్సీ వర్గీకరణ అమలుపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో వేసిన కేసు వెనక కృష్ణ మాదిగ హస్తం ఉందని ఆరోపించారు.

అని అదేవిధంగా చెన్నయ్య మందకృష్ణ మాదిగ రహస్య మిత్రులని అన్నారు. మాదిగలంతా రేవంత్ రెడ్డి వెంట ఉంటే ఓర్వలేని కృష్ణ మాదిగ ఈ పని చేశారని, భవిష్యత్తులో బిజెపి బలోపేతం కోసం వర్గీకరణ సమస్య పరిష్కరించకుంటే దానితో పబ్బం గడపాలని బిజెపిని తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేయడమే కృష్ణ మాదిగ లక్ష్యం అని అన్నారు.

కృష్ణ మాదిగ ఎన్ని కుట్రలు చేసిన వాటిని తిప్పికొడుతూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి తీరుతారని అన్నాడు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మీసాల మల్లేష్, బిఎస్‌ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్, సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షులు నిమ్మల వీరన్న, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి, మాదిగ విద్యార్థి జేఏసీ ఓయూ అధ్యక్షులు జోగు గణేష్, మాదిగ జేఏసీ నాయకులు పిడమర్తి రాంబాబు, శేఖర్, సైదులు తదితరులు పాల్గొన్నారు.