29-01-2025 01:51:07 AM
భువనేశ్వర్, జనవరి 28: బ్రిటీష్ రాక్ బ్యాండ్ కోల్డ్ ప్లే గురించి ఆ బ్యాండ్ భారత్‌లో ఇస్తున్న ప్రదర్శనల గురించి ప్రత్యే కంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ బ్యాండ్ ప్రదర్శనలు నిర్వహించగా.. అవి ఫుల్ సక్సెస్ అయ్యాయి. ఈ బ్యాండ్ గురించి తాజాగా ప్రధాని కూడా మాట్లాడారు. ‘ తరహా కాన్సర్ట్‌లకు ఇండియాలో మంచి స్కోప్ ఉందని చెప్పేందుకు ముంబై, అహ్మదాబాద్ షోలే నిదర్శనం. దేశంలో కాన్సర్ట్ ఎకానమీ రంగం రోజురోజుకీ అభివృద్ధి చెందుతోంది. ఇం దుకు తగ్గ మౌలిక సదుపాయాలపై రాష్ట్రప్రభుత్వాలు, ప్రైవేటు రంగాలు దృష్టి సారిం చాలి’ అని మోదీ తెలిపారు.