29-01-2025 01:00:46 AM
ఒక్క మాట మాట్లాడినా జరిమానా విధిస్తామని పిటిషనర్‌పై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ, జనవరి 28: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఉన్న సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివే సింది. ఈసందర్భంగా పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబుపై ఉన్న ఏడు కేసులను సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య సుప్రీంలో పిటిషన్ వేశారు. ఇది పూర్తిస్థాయిలో తప్పుడు పిటిషన్ అని జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేసింది.
పిటిషన్‌కు సంబంధిం చి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమా నా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది హెచ్చరించారు. బాలయ్య తరఫున వాదనలు విని పించడానికి సీనియర్ న్యాయవాది మణీందర్‌సింగ్ సిద్ధంకాగా.. ఇలాంటి పిటిషన్లను కూడా మీరు వాదిస్తారా? అని తీవ్ర అసహ నం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసుల్లో కూడా మీలాంటి సీనియర్లు హాజరవుతారని అస లు ఊహించలేదని వ్యాఖ్యానించారు. ఒక్క మాట కూడా మాట్లాడొద్దంటూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.