29-12-2025 01:59:44 AM
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డిలో పార్టీ ఆవిర్భావ వేడుకలు
సంగారెడ్డి, డిసెంబర్ 28 (విజయక్రాంతి): కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ చిత్రం తీసేయాలని ప్రధాని మోదీ, అమిత్ షా కుట్ర చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ కుటుంబ చరిత్ర దేశంలో లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆది వారం కాంగ్రెస్ పార్టీ 141 ఏళ్ల ఆవిర్భావ వేడుకను సంగారెడ్డి పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలాజగ్గారెడ్డితో కలిసి జెండాను ఎగురువేసిన జగ్గారెడ్డి.. మీడియాతో మాట్లాడారు. ప్రజ లు స్వేచ్ఛగా జీవించాలని మహాత్మా గాంధీ నేతృత్వంలో మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ.. ఇంకా ఎందరో స్వాతంత్య్రం కోసం శాంతియుత మార్గంలో పోరాటం చేశారన్నారు.
జవహర్ లాల్ నెహ్రూ దేశానికి ఏం చేశారని మోదీ, అమిత్ షా విచిత్రంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. స్వాతంత్య్రం కోసం జవహర్ లాల్ నెహ్రూ 12 ఏళ్లు జైలు జీవితం గడిపారని, ఇందిరాగాంధీ కూడా జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. దేశప్రజలు సుఖ శాంతులతో బతకాలన్నా, హక్కులు పొందాలన్నా రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఆంజనేయులు, సిడిసి చైర్మన్ రామ్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సదా శివపేట మండల అధ్యక్షులు సిద్దన్న, సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు జార్జ్, బుచ్చి రాము లు, నర్సింహారెడ్డి, నాయకులు కూన సంతో ష్, కిరణ్ గౌడ్,మహేష్, శ్రీకాంతగౌడ్, బల్వంత్ రెడ్డి, అనిల్, చారి, తదితరులు పాల్గొన్నారు.