31-10-2025 05:57:29 PM
 
							వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని మొగిలిపాక గ్రామంలో ఎంతో కాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యని ఎంపీడీవో జలంధర్ రెడ్డి గ్రామస్తులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. డ్రైనేజ్ వాటర్ పంట పొలాలకు వెళ్తుండడంతో పొలాల ప్రక్కనున్న మొగిలిపాక పాపయ్యను ఒప్పించి డ్రైనేజీ నీరు మళ్లించేలా చూశారు. దీంతో రైతులు గ్రామ ప్రజలు ఎంపీడీవో జలంధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఎలువర్తిలోని ఇందిరమైన నిర్మాణాన్ని పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని తెలియజేశారు అనంతరం రెడ్లరేపాక గ్రామంలో ఆరోగ్య సిబ్బందితో కలిసి ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ సందీప్ రెడ్డి, కార్యదర్శి మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు.