31-10-2025 06:04:08 PM
 
							కట్టంగూర్ ఎస్సై మునుగోటి రవీందర్
నకిరేకల్,(విజయక్రాంతి): ఉక్కు మనిషి భారతదేశ తొలి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేటి యువతరానికి, విద్యార్థులు ఎంతో స్ఫూర్తిదాయకమని కట్టంగూర్ ఎస్సై మునుగోటి రవీందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కట్టంగూరు మండల కేంద్రంలో దివంగత సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ని పురస్కరించుకొని దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ప్రజలతో కలిసి 'సమైక్యత పరుగు' నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ తొలి హోం మంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని దేశంలో శాంతి భద్రతల పరిరక్షణకు బాటలు వేశారని ఆయన కొనియాడారు. సర్దార్ సమయస్ఫూర్తి ధైర్యంతోనే నాడు నిజాం సంస్థానం భారతదేశంలో విలీనమైనదని గుర్తు చేశారు. సర్దార్ పటేల్ ధైర్యసాహసాలు సాసోపేతమైన నిర్ణయాలతో ఉక్కుమనిషిగా ప్రత్యేక గుర్తింపును పొందారని ఆయన. నేటితరం ఆయన బాటలో పయనించి భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు.