31-10-2025 05:53:59 PM
 
							మఠంపల్లి: సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన మంచ్యతండా శ్రీ శ్రీ దుప్పలగట్టు బంగారు మైసమ్మ తల్లి జాతర నవంబర్ 15,16,17 తేదీలలో జరుకొవాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు.అందులో భాగంగా నవంబర్ ఒకటో తారీకు నుండే మంచ్యతండా గ్రామంలో పెద్దపోలి జాతర సంబరాలు మొదలుకానున్నాయి.
నవంబర్ 1 తేదీన అమ్మవారి నూతన విగ్రహానికి ప్రాణ ప్రతిష్టాపన అయ్యగార్ల చేతుల మీదుగా మంచ్యతండ ప్రజల సమక్షంలో జరుగుతాయని, 16 రోజుల తర్వాత పెద్దపోలి జాతరను మంచ్యతండ పరిసర ప్రాంత ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారని అమ్మవారి జాతర గట్టు మీద కాబట్టి జాతరను దృష్టిలో పెట్టుకొని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో మట్టంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూక్యా నీలామంజి నాయక్ గట్టు మీద పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.