15-07-2025 12:16:06 AM
కామారెడ్డి, జూలై 14 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా మోహన్ రెడ్డి వికారాబాద్ నుంచి బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు. బదిలీ అయిన తిరుమల ప్రసాద్ నుంచి మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బదిలీపై వెళ్లిన డీఏవో తిరుమల ప్రసాద్, నూతనంగా వచ్చిన డిఏఓ మోహన్ రెడ్డి లను శాలువాతో పూల బోకతో సన్మానించారు.
అనంతరం కలెక్టర్ అసిస్ సంఘవన్ మర్యాదపూర్వకంగా జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, బదిలీపై వెళ్లిన తిరుమల ప్రసాదులు కలిసి మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారిగా బాధ్యతలు చేపట్టిన మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఏదైనా వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్య వస్తే తన దృష్టికి తీసుకురావాలని జిల్లా రైతులను కోరారు.
మండల వ్యవసాయ అధికారులు ఏఈవోలు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎరువుల సమస్య విత్తనాల సమస్య రాకుండా చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, శివకుమార్, చక్రధర్, దేవరాజు, సంతోష్ కుమార్, పవన్ కుమార్, వ్యవసాయ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.