06-11-2025 01:22:31 AM
కుంభ మేళా ఫేమ్ మోనాలిసా భోంస్లే తెలుగులో కథానాయికగా మారుతోంది. సాయిచరణ్ హీరోగా పరిచయమవుతున్నాడు. వెంగమాంబ క్రియేష నర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ‘లైఫ్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. నిర్మాత అంజయ్య విరిగినేని నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీను కోటపాటి దర్శకుడు. ఇందులో సీనియర్ హీరో సురేశ్, షాయాజీ షిండే, ఆమని, తులసి, వినయ్, రచ్చ రవి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా పూజా కార్యక్రమాలతో బుధవారం ప్రారంభమైంది. సీనియర్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి ముహూర్తం చేశారు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు సురేశ్ క్లాప్ కొట్టగా, నిర్మాత డీఎస్ రావ్ కెమెరా స్విచ్చాన్ చేయగా శివన్నారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం నిర్మాత అంజన్న మాట్లాడుతూ.. ‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీవితాలు ఈ చిత్ర కథకు ఆధారం’ అని చెప్పారు.
మోనాలిసా మాట్లాడుతూ.. “నాతో తెలుగు సినిమా చేయడం ఆనందంగా ఉంది. తెలుగు త్వరలో నేర్చుకుంటా. లైఫ్ సినిమా అందరికీ మంచి లైఫ్ ఇవ్వాలి” అన్నది. ఈ చిత్రానికి డీవోపీ: మురళీమోహన్‌రెడ్డి; సంగీతం: సుకు మార్; సాహిత్యం: కాసర్ల శ్యామ్; డైలాగ్: శ్రీరామ్ ఏదోటి, గుత్తి మల్లికార్జున్, భాస్కర్; స్టంట్స్: నందు; ఆర్ట్: బేబీ సురేశ్.