calender_icon.png 1 December, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

01-12-2025 12:15:45 AM

టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా కార్యదర్శి వెంకట్రాంరెడ్డి

ఉప్పల్, నవంబర్ 30 (విజయక్రాంతి): జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతుల  వెంకటరామిరెడ్డి అన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం  టీయూడ బ్ల్యూజే ఆధ్వర్యంలో  డిసెంబర్ 3న హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమా చార శాఖ హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని కార్యాలయం ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ రామంతపూర్ లో జర్నలిస్టులతో కలిసి  కరపత్రాన్ని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే జర్నలిస్టులకు ఎలాంటి సదుపాయాలు కలగడం లేదన్నారు. అక్రిడేషన్ కార్డుల విడుదలపై జాప్యం చేయడం తగదన్నారు.  ఆరోగ్య స్కీం, ఇండ్లపట్టాల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.  మధ్యతరగతి చెందిన కుటుంబాలకు చెందినవారే జర్నలిజంలో ఎక్కువగా ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ డిసెంబర్ 3న చేపడుతున్న ధర్నా  కార్యక్రమానికి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే మేడ్చల్ జిల్లా హెల్త్ కమిటీ కన్వీనర్ కొలనుపాక చంద్రమౌళి, ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షులు పల్ల మహేందర్రెడ్డి,  సీనియర్ జర్నలిస్టులు సురేష్ ధూపాటి, వేముల తిరుపతిరెడ్డి, కె. నరోత్తం రెడ్డి, ఏం.అశోక్, యాదగిరి,  ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు స్టాలిన్, నరేందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు