05-09-2025 01:53:56 PM
మహాశక్తి ఆలయంలో గణేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి సంజయ్..
కరీంనగర్ లో ప్రారంభమైన గణేశ్ నిమజ్జనం..
కరీంనగర్ (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) ట్రాక్టర్ నడిపారు. కరీంనగర్ లో శుక్రవారం గణేశ్ నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మహాశక్తి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి బండి సంజయ్ స్వయంగా గణేశ్ విగ్రహాన్ని ట్రాక్టర్ లో ప్రతిష్టించారు. ఆ వెంటనే బండి సంజయ్ ట్రాక్టర్ ఎక్కి కొద్ది దూరం డ్రైవింగ్ చేశారు. మరోవైపు కరీంనగర్ లో ఘనంగా గణేశ్ నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది.