calender_icon.png 9 September, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు

03-09-2025 11:31:49 PM

ఎవరి ఇష్టం సారంగా వారు మాట్లాడితే ఎలా ?

కవిత సస్పెండ్  స్వాగతిస్తున్నాం

విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి

జడ్చర్ల: పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించి తప్పుల మీద తప్పులు చేస్తూ పోతే చర్యలు తప్పవని మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం జడ్చర్ల మండల కేంద్రంలో అంబేద్కర్ భవన్లో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి అన్నారు.  కెసిఆర్ కు కన్న కూతురు అయినా మరెవరైనా కన్నాకార్యకర్తల భవిష్యత్తే ముఖ్యమని కేసీఆర్ అనుకున్నారని, పార్టీ నియమ నిబంధనలు కట్టుబడి ఉండకుండా ఇష్టం సారంగా మాట్లాడడం వెనుక ఉన్న అంతర్వేమిటో కవిత చెప్పాలన్నారు. అందుకే ఆమెను సస్పెండ్ చేశారని పేర్కొన్నారు.

కొద్ది రోజులుగా పార్టీ నాయకులు, కార్యకర్తలను కవిత అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. ఆమె వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని గుర్తించి సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలనలోని అభివృద్ధి చెందిందన్నారు. మిషన్ భగీరథ మిషన్ కాకతీయ వంటి అనేక అభివృద్ధికార్యక్రమాలు జరిగాయన్నారు. కెసిఆర్ పాలనతో  ప్రజలు సంతోషంగా ఉన్నారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు యూరియా కోసం పడిగాపులు కావలసిన పరిస్థితి వచ్చిందన్నారు. నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఆసనం వ్యక్తం చేశారు.

రైతులు యూరియా అందించండి మహా ప్రభువు అంటూ వేడుకుంటున్న ప్రభుత్వము నిమ్మకు నీరుతున్నట్లు వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. గత పది ఏళ్లలో రాణి సమస్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎలా వచ్చిందో ఒక్కసారి ప్రభుత్వం వివరంగా రైతులకు తెలపాలన్నారు. ముందస్తు ఆలోచనలు లేకుండా ఇస్తాను సారంగా కాలయాపన చేసి రైతులకు యూరియా కావాలంటే అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామంటూ మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రైతులకు మరింత మేలు చేస్తామని స్పష్టం చేశారు.