24-07-2025 12:23:41 AM
పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, జులై 23 : ఆషాడ మాసం పురస్కరించుకొని పటాన్ చెరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి ఫలహారం బండ్ల ఊరేగింపు వైభవంగా జరిగింది. ఫలహారం బండ్ల ఊరేగింపులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కార్యక్రమం నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అన్నారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, పటాన్ చెరు పట్టణ నాయకులు, ఆయా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే
పటాన్ చెరు, జులై 23 : పటాన్ చెరు వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం విశ్వశాంతి కై పటాన్ చెరు నుంచి బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయం వరకు నిర్వహించే మహా పాదయాత్ర పోస్టర్ ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు.
సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో వీరశైవ లింగాయత్ సమాజం ప్రతినిధుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పోస్టర్ ను ఆవిష్కరించారు. విశ్వశాంతికై 18 సంవత్సరాలగా పాదయాత్ర నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, సంఘం ప్రతినిధులుపాల్గొన్నారు.