20-09-2025 12:00:00 AM
అదిలాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాం తి): గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలను అందించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఉమ్మడి తాంసి మండలంలో చేప ట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డితో కలిసి వారు పాల్గొన్నారు. తాంసిలో నూతన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు.
అనంతరం ప్రధాన మంత్రి మాతృ వందన పథకం కింద ప్రసూతి ప్రయోజనాల కిట్ల పంపిణీ చేపట్టారు. మార్కాగూడలో నూతనంగా నిర్మించిన పంచాయితీ భవనం ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్య కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు.
కొత్త పంచాయతీలు చేసిన ఘనత గత ప్రభుత్వందేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కరంజి (టీ), గుబిడి రోడ్ల నిర్మాణం పనులు త్వరలో ప్రారంభమవుతుందన్నారు. ప్రభు త్వం వర్షాల వల్ల పంటలు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, బీఆర్‌ఎస్ నాయకులు కృష్ణ, రమణ, రఘు, అశోక్, డాక్టర్ శ్రావ్యవాణీ, డీఈ శివరాం, మహేందర్ పాల్గొన్నారు.