28-07-2025 11:55:13 PM
హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ..
ముషీరాబాద్ (విజయక్రాంతి): భారత సైన్యంలో సైనికులకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని హిమాచల్ ప్రదేశ్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Former Governor Bandaru Dattatreya) అన్నారు. భారత సైన్యంలో వైద్య అధికారిగా సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేజర్ కవిత వసుపల్లి, వీఎస్‌ఎం ను హైదరాబాద్ రాంనగర్ లోని తన నివాసంలో సోమవారం బండారు దత్తాత్రేయ శాలువా పూల బొకేతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, ఇటీవల కల్నల్ రణవీర్ సింగ్ జమ్వాల్, ఎస్‌ఎం, వీఎస్‌ఎం, డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోరట్స్ (ఎన్‌ఐఎంఏ ఎస్) నేతృత్వంలో నిర్వహించిన 28 రోజులలో 1040 కిలోమీటర్ల బ్రహ్మపుత్ర నది రివర్ రాఫ్టింగ్ ఎక్స్పెడిషన్లో మేజర్ కవిత వసుపల్లి వీఎస్‌ఎం ఏకైక మహిళగా పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ వ్యక్తిగత కార్యదర్శి కైలాస్ నాగేష్ పాల్గొన్నారు.