calender_icon.png 29 July, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిల్టాప్ కాలనీలో వాటర్‌ట్యాంక్ ప్రారంభం

28-07-2025 11:52:22 PM

సొంత నిధులతో నిర్మించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి

మల్కాజిగిరి: మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajasekhar Reddy) తన సొంత నిధులతో గౌతమ్నగర్ డివిజన్ పరిధిలోని హిల్టాప్ కాలనీలో నిర్మించిన వాటర్ ట్యాంకులను సోమవారం ప్రారంభించారు. కాలనీవాసులు తరచూ ఎదుర్కొంటున్న నీటి సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే సుమారు రూ.3.5 లక్షల వ్యయంతో ఐదు వాటర్ ట్యాంకులను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హిల్టాప్ కాలనీలో వర్షాకాలంలో లేదా వేసవిలో నీటి కోసం ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించి ఈ చర్యలు చేపట్టాం. మల్కాజిగిరిలో దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యల పరిష్కారమే నా ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాములు, బీఆర్‌ఎస్ నాయకులు మేకల రాము యాదవ్, బైరు అనిల్, ప్రేమ్ కుమార్, అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.