calender_icon.png 21 November, 2025 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకటేశ్వర ఆలయంలో ఎంపీ రఘునందన్ రావు పూజలు

16-08-2024 07:24:17 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు శుక్రవారం సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎంపీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎంపీ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. 

ఈ సందర్భంగా ఎంపీ మాధవనేని రఘునందన్ రావు మాట్లాడుతూ... వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఎంపీ ఆకాంక్షించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కోడూరి నరేష్, బీజేపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.