16-08-2024 07:16:56 PM
సిద్దిపేట: పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. అన్న పరుశురాములు తమ్ముడు కనకయ్యతో రూ.1,20,000 అప్పుగా తీసుకున్నాడు. తిరిగి రూ.లక్ష చెల్లించగా మిగిలిన రూ.20,000 మిత్తి ఇవ్వామంటే అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన తమ్ముడు కనకయ్య అన్న వదినను గ్రామంలోని గుడి ప్రాంగణంలోని చెట్టుకు కట్టేశాడు. బాధితులు సిద్దిపేట వన్ టౌన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.