03-05-2025 04:49:57 PM
ఏఐవైఎఫ్ 66 ఆవిర్భావ దినోత్సవం...
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొంకుల రాజేష్ అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) 66 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ అధ్యక్షతన ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణం భగత్ సింగ్ స్టాచ్ వద్ద ఏఐవైఎఫ్ జెండాను సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి ఆవిష్కరించారు.
ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ మాట్లాడుతూ... దేశంలో సింహభాగం యువత ఉందని రేపటి దేశ భవిష్యత్తు అయిన యువతను విద్యా ఉద్యోగ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో ప్రోత్సహించి వారి అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. యువతరం కూడా మద్యం గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు బానిసలు అవ్వకుండా మతం మత్తులో పడకుండా జాగ్రత్త పడాలన్నారు. ఆధునిక సాంకేతిక విద్యను సైంటిఫిక్ విజ్ఞానాన్ని మూల కేంద్రంగా చేసుకొని చదువు చదివించు అనే సంకల్పంతో ముందుకు పోవాలన్నారు.
దేశ యువతను విద్యావంతులుగా చేసే బాధ్యతను యువతరం తమ భుజాలపై వేసుకోవాలన్నారు. ఇలాంటి మరెన్నో మహత్తరమైన కార్యక్రమాలను ఏఐవైఎఫ్ చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, జిల్లా సమితి సభ్యులు గుండా చంద్రమాణిక్యం, ఏఐవైఎఫ్ నాయకులు సింగారావు శీను, మహమ్మద్ ముస్తఫా, సత్యనారాయణ, రాజు, రాము, తదితరులు పాల్గొన్నారు.