calender_icon.png 12 July, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన ఎంపీడీఓ

12-07-2025 01:02:10 AM

కామారెడ్డి,జులై 11 (విజయ క్రాంతి)కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సీతారాం పల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి, ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ’వన మహో త్సవం-2025’ కార్యక్రమంలో బాగంగా శుక్రవారం  కస్తూర్బా గాంధీ పాఠశాలలో  మొక్కలను నాటిన ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ మంగమ్మ పాల్గొన్న ఉపాధ్యాయులు,పాఠశాల విద్యార్థులు.ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్  మాట్లాడుతూ.

తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 2కోట్ల 75లక్షల ఎకరాలు, ఈ ప్రకృతి మనకు అనుకూలంగా ఉండాలి అంటే సరైన సమయంలో వర్షాలు పడాలంటే వాతావరణం సమతుల్యం ఉండాలి, ఈ ప్రయత్నంలో నే మన రాష్ట్ర ప్రభుత్వంవనమహోత్సవం-2025 కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది 18.02 కో ట్ల మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని అన్నారు.

మండలంలోని ప్రతి గ్రామంలో అందుకు గాను ప్రతి ఇంటికి ఆరు మొక్కలను ప్రభుత్వం నుండి పంపిణీ చేయనున్నారు, పంపిణీ చేసిన మొక్కలను  విద్యార్థిని విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయ బృందం, అ ధికారులు, ప్రతి ఒక్కరు మొక్కలను నాటి ఈ వన మహోత్సవం-2025 కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో  అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.