12-06-2025 11:05:55 PM
మునగాల: సూర్యాపేట జిల్లా(Suryapet District) మునగాల మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో సత్యమ్మ గుడి వద్ద ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి రాష్ట్ర నాయకులు మునగాల మండల ఇంచార్జ్ వడ్డేపల్లి కోటేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజు మాదిగ ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్సీ మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీను మాదిగలు హాజరయ్యారు.
అనంతరం వారు మాట్లాడుతూ... జులై 7.న జరిగే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం మండలంలోని ప్రతి గ్రామంలో నిర్వహించాలనిప్రతి గ్రామంలో జెండా దిమ్మెలు నిర్మాణం చెయ్యాలనితెలియజేశారు. మాదిగల దైవం *పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తన జీవితాన్ని మాదిగ సమాజం కోసం అంకితం చేసాడని, ప్రతి సంక్షేమ పథకం లో మందకృష్ణ మాదిగ పోరాటం ఉందని తెలిపారు.
మాదిగ జాతి కోసం పోరాడుతూనే సమాజంలో సబ్బండ వర్గాల శ్రేయస్సు కోసం పాటు పడిన వ్యక్తికి పద్మశ్రీ రావడం ఎంతో సంతోషాదయకమని, ఆ పద్మశ్రీ పేద వర్గాలకు వచ్చిందని, జాతి కోసం చేసిన పోరాటాన్ని గ్రామాలలో తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి మాదిగ బిడ్డకు ఉందని, దాంట్లో భాగంగా యల్ఇడి స్క్రీన్ లు ఏర్పాటు చేసి ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానాన్ని చూపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గుడిపాటి కనకయ్య మాదిగ, ఎంఎస్పి మండల అధ్యక్షుడు లంజపల్లి శ్రీను , మాజీ ఉపసర్పంచ్ లంజపల్లి వెంకయ్య,లంజపల్లి సత్యం, ఇట్టికాల వెంకన్న, ఇటికాల వెంకటరాములు, జిల్లాపల్లి పిచ్చయ్య, లంజపల్లి లాజర్, జిల్లా తిరపయ్య, లంజపల్లి రఘునాథం, మండల మాదిగ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.