calender_icon.png 31 January, 2026 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరల్డ్ టీన్ పార్లమెంట్‌కు ఎంఎస్ విద్యార్థినులు

31-01-2026 12:00:00 AM

వరుసగా ఐదో ఏడాది అంతర్జాతీయ వేదికకు ఎంపిక

ఖైరతాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టీన్ పార్ల మెంట్ 5వ సెషన్కు ఎంఎస్ క్రియేటివ్ స్కూ ల్కు చెందిన ఏడుగురు విద్యార్థినులు ఎంపి కై అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన యువ ప్రతిభావంతులను ఒకచోట చేర్చే ఈ విద్యా ర్థి ఆధారిత అంతర్జాతీయ వేదికకు ఎంఎస్ విద్యార్థులు వరుసగా ఐదో ఏడాది కూడా ఎంపిక కావడం విశేషమని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ఈ ఏడాది ఎంపికైన వారిలో మదిహా ఫాతిమా, సయ్యదా మరి యం సుల్తానా, సయ్యదా జైనబ్ కలీమ్ (9వ తరగతి), షిఫా నాజ్ (10వ తరగతి), ఆయేషా ఫాతిమా, సయ్యదా నబీలా రాహత్, లోధి ఆయేషా ఖాన్ (8వ తరగతి) ఉన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ మొజామ్ హుస్సేన్ మాట్లాడుతూ 50 దేశాల నుంచి సుమారు 5 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కఠినమైన ఎంపిక ప్రక్రియలో ఎంఎస్ అకాడమీ నుంచి మొద ట 30 మంది షార్ట్లిస్ట్ అయ్యారని అన్నారు.

అనంతరం గ్లోబల్ ఓటింగ్, మెరిట్ ఆధారిత మూల్యాంకనం ద్వారా ఈ ఏడుగురు తుది స్థానాలను దక్కించుకున్నారని తెలిపారు. ఈ అంతర్జాతీయ వేదిక ద్వారా ప్రపంచ సమస్యలపై అవగాహన పెంచుకుంటూ, సమా జంలో సానుకూల మార్పు కోసం విద్యార్థులు కృషి చేయాలని ఆయన ఆకాంక్షిం చారు. మెరిట్ ప్రాతిపదికన గ్లోబల్ ఎంపీలుగా ఎంపికైన ఈ విద్యార్థినులు తమ ప్రతి భతో పాటు విద్యాసంస్థకు, దేశానికి గర్వకారణంగా నిలిచారని విద్యార్థినులను మేనేజ్మెంట్ అభినందించింది.