calender_icon.png 5 July, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు స్వయం ఉపాధిలో రాణించాలి

05-07-2025 05:29:40 PM

ఎఎస్పీ చిత్తరంజన్..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మహిళలు స్వయం ఉపాధిలో రాణించాలని ఏఎస్పీ చిత్తారంజన్(ASP Chittaranjan) దెబ్బెన మండలం గోలేటిలో పసుధ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని వరంగల్ జోన్ ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ అచ్చేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ... మహిళల్లో ఆత్మ గౌరవం ఆర్థిక స్వావలంబన సాధించే లక్ష్యంతో ఈ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళలకు టైలరింగ్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించి వారిలో ఆర్థిక పరిపుష్టి కల్పించడమే వసుధ స్వచ్చంధ సేవా సంస్థ లక్ష్యమని  సంస్థ సభ్యురాలు ఉమ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ కన్వీనర్ సొల్లు లక్ష్మీ, ఎస్ఐ చంద్రశేఖర్, మహిళలు పాల్గొన్నారు.