05-10-2025 12:00:00 AM
-గ్రంథాలయానికి వారంలోగా పుస్తకాలు
-త్వరలో నూతన షెడ్డు నిర్మాణం
-కళాకారులను ఆదుకునేందుకు సాహితీ పీఠం ఏర్పాటు
-ఓఎస్ డీ వేముల శ్రీనివాస్
భీమదేవరపల్లి, అక్టోబర్ 3 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ముల్కనూర్ మోడల్ లైబ్రరీని మరింత తీర్చిదిద్దుతామని ఓఎస్‌డీ వేముల శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయదశమి పర్వదిన సందర్భంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని మోడల్ లైబ్రరీలోని శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ మోడల్ లైబ్రరీలో విద్యార్థులకు బుక్స్ కొరత ఉందని విద్యార్థులు తన దృష్టికి తెచ్చాని, వారం రోజుల్లోగా అన్ని సమకూరుస్తామని హామీ ఇచ్చారు. గ్రంథాలయ ఆవరణలో నూతనంగా షెడ్డును త్వరలో నిర్మాణం చేపడతామన్నారు. ముల్కనూర్ లైబ్రరీకి అనుసంధానంగా తెలుగు కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు ముల్కనూర్ సాహితీ పీఠం ఏర్పాటు చేస్తున్నట్లు ఓఎస్‌డీ పేర్కొన్నారు.
సాహితి పీఠంకు అనుమాండ్ల అనిత ప్రసాద్ రెడ్డిలు 10వేలుఆర్థిక సహాయం ఓఎస్‌డీకి అందజేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కలిగి ఉన్న విద్యను అభ్యసించి ఉన్నతంగా ఉండేందుకు కృషి చేయాలని అప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని చదువుకోవాలన్నారు. ఓఎస్‌డీ వెంట సుద్దాల సంపత్, అయిత కిషన్ ,కోడూరి సుగుణాకర్, పళ్ళ ప్రమోద్ రెడ్డి ,బొజ్జపురి అశోక్ ముఖర్జీ ,కొలుగూరి రాజు, మాజీ సర్పంచ్ మాడుగుల కొమురయ్య, ఎదులాపురం తిరుపతి, తాళ్ల వీరేశం, గొల్లపల్లి లక్ష్మయ్య, అప్పని పద్మ బిక్షపతి అర్చకులు జానకిపురం రవి శర్మలు ఉన్నారు.