04-10-2025 01:39:52 AM
మద్యం అమ్మకాలు
సంవత్సరం లిక్కర్ బీర్లు
(లక్షల కేసులు)
2025 29.92 36.46
2024 28.81 39.71
మూడు రోజుల అమ్మకాలు
సెప్టెంబర్ 29న 278 కోట్లు
సెప్టెంబర్ 30న 333 కోట్లు
అక్టోబర్ 1న 86.23 కోట్లు
హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : ఈసారి దసరా పండుగకు రూ. 697.23 కోట్లు లిక్కర్ అమ్మకాలు జరిగాయి. దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు వచ్చినా.. ప్రభుత్వం మద్యం విక్రయాలపై నిషేధం విధించినా.. అమ్మకాల్లో మాత్రం ఎక్కడా తేడా రాలేదు. గత నెల 29, 30, అక్టోబర్ 1 తేదీల్లో రూ. 697.33 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు ఆబ్కారీ లెక్కలు చెబుతున్నాయి. ఇది గత ఏడాదితో పోల్చితే ఇది 7 శాతం ఎక్కువ. సెప్టెంబర్ నెలలో మొత్తంగా రూ. 3048 వేల కోట్ల మద్యం అమ్మకా లు జరిగాయి.
గత నెల 29న 278 కోట్లు, 30న రూ. 333 కోట్లు, అక్టోబర్ 1న 86.23 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాదిలో, ప్రస్తుత సంవత్సరంలో మూడు రోజులకు గాను 60 నుంచి 80 శాతం వరకు మద్యం సేల్ అయినట్టు తెలుస్తోంది. దసరా పండుగకు ముందు మూడు రోజుల్లో 6.71 లక్షల కేసుల లిక్కర్ సేల్ అయినట్టు ఎక్సుజ్ శాఖ రికార్డులు చెబుతున్నాయి. 7.22 వేల కేసుల బీర్లు సైతం అమ్ముడు పోయాయి.
గత ఏడాది ఇదే సమయంలో మూడు రోజుల్లో 530 కోట్ల లిక్కర్ వ్యాపారం జరిగింది. 2025లో లిక్కర్ అమ్మకాలు 29.92 లక్షల కేసులు, బీర్లు 36.46 లక్షల కేసులు అమ్మకం జరిగింది. ఇక 2024లో లిక్కర్ అమ్మకాలు 28.81 కేసులు, బీర్లు 39.71 లక్షల కేసుల విక్రయం జరిగింది. ఈ ఏడాది దసరాకు ఈ మూడు రోజుల్లో 697.23 కోట్ల లిక్కర్ సేల్స్ జరగడం గమనార్హం. సెప్టెంబర్ నెల రోజులతోపాటు అక్టోబర్ నెలలోని 1వ తేదీన కలిపి కలిపి 3,134.23 కోట్ల లిక్కర్ వ్యాపారం సాగిందని అబ్కారీ శాఖ లెక్కలు చెబుతున్నాయి.