calender_icon.png 4 October, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్కరి చదువుతో తరతరాలు బాగుపడతాయి

04-10-2025 12:28:28 AM

విద్యార్థిని చదువుకు భరోసాను అందించిన ఎమ్మెల్యే

చిన్న చింతకుంట ,అక్టోబర్ 3: మండల కేంద్రానికి చెందిన పేదింటి విద్యార్థి జొన రే చల్ డి. ఆర్ పట్నం మహేందర్ రెడ్డి మెడిక ల్ కాలేజీలో మెడికల్ సీటు సాధించింది. కాలేజీ ఫీజు చెల్లించలేని దుస్థితిలో కుటుంబ సభ్యులు ఉండడంతో శుక్రవారం దేవరకద్ర ఎ మ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ని విద్యార్థితో పాటు తల్లిదండ్రులు కలవడంతో ఆయన వెంటనే స్పందించి రూ.50 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆ యన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంబిబిఎస్ సీటు సాధించడం అభినందనీయమని, వి ద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్న నానుడిని నిజం చేసిందని ఆయన కొనియాడారు.

భవిష్యత్తులో విద్యార్థికి అండగా ఉం టానని తెలిపారు. అడిగిన వెంటనే ఆర్థిక స హాయం అందించి మాకు కొండంత ధైర్యా న్ని ఇచ్చిన ఎమ్మెల్యేకు విద్యార్థిని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో విండో చైర్మన్ సురేందర్ రెడ్డి, నా యకులు ఎస్ వెంకటేష్, అక్బర్, శేఖర్, యా కూబ్, శంకర్ తదితరులు ఉన్నారు.