04-10-2025 12:50:08 AM
అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు..
ముగిసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు..
అలంపూర్, అక్టోబర్ 3: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. గురువారం రాత్రి విజయదశమి పురస్క రించుకుని ఆలయ సమీపంలో ఉన్న తుంగభద్ర నది తీరంలో హంస వాహనం పై కొ లువు దీరిన ఆది దంపతులు తెప్పోత్సవ కా ర్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహత్తర కార్యక్రమాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో తుంగభద్ర పుష్కర ఘాట్ భక్త జనసంద్రం గా మారింది.
ముందుగా ఆలయం నుంచి పల్లకిలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి పుష్కర ఘాట్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అ నంతరం అర్చకులు, తుంగభద్ర నదీమ తల్లికి హారతి నిర్వహించారు. అనంతరం వి ద్యుత్ దీపాలతో అలంకరించిన హంస వా హనంలో భక్తులు వీక్షిస్తుండగా ఉత్సవమూర్తుల తెప్పోత్సవ కార్యక్రమం అంగరంగ వై భవంగా కన్నుల పండువగా జరిగింది. జోగులాంబ ఆలయంలో పది రోజులపాటు కొన సాగిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు విజయదశమితో ముగిశాయి. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, గద్వాల సంస్థానా వారసులు కృష్ణా రాంభూపాల్ ఆలయ ఈవో దీప్తి ఆలయ ధర్మకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
భారీ బందోబస్తు ఏర్పాటు
స్వామి అమ్మవార్ల తెప్పోత్సవ కార్యక్ర మం సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాస రా వు ఆదేశాల మేరకు డి.ఎస్.పి మొగిలయ్య ప ర్యవేక్షణలో ఇద్దరు సిఐలు, పదిమంది ఎస్‌ఐలు మరియు పోలీసు ఇబ్బంది ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో పుష్కర ఘాట్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షించారు.