04-10-2025 12:22:14 AM
మంచిర్యాల, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : మంచిర్యాలలోని రిజిస్టర్డ్ ప్రాథమిక కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘంలో అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి న్యాయం చేయాలని కలెక్టరేట్ లో ప్రతీ సోమ వారం నిర్వహించే ప్రజావాణిలో భాగంగా ఆగస్టు 4న హాజరై కలెక్టర్ కుమార్ దీపక్ కు సం ఘంలోని సభ్యుడు కోల రాజాగౌడ్ విన్నవించుకున్నాడు. సంఘంలో లక్షలకు లక్షలు అవినీతి రాజ్యమేలుతుందని, వివిధ పార్టీలలో పని చేసిన ఒక నాయకుడు తనను తాను కన్వీనర్ గా ప్రకటించుకొని అనేక అవకతవలకు పాల్పడుతూ అమాయక కల్లుగీత కార్మి కులపై పెత్తనం చెలాయిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
కలెక్టర్ ఆదేశించినా పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు...
జిల్లా బాస్ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదును స్వీకరించి పరిశీలించాలని స్వయంగా ఎక్సైజ్ శాఖకు రెఫర్ చేశారు. దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఫిర్యాదుపై ఇంత వరకు ఎవరూ పట్టించుకోవడం లేదు. బాధితుడు స్వయంగా ఎక్సైజ్ సూపరింటెం డెం ట్ నంద గోపాల్‌ను కలిసినా ఫలితం లేదు. ఈ విషయంపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ కో ఆపరేటివ్ ఆడిట్ ఆఫీసర్ దేవేందర్ ను సంప్రదించగా తనకు ఈ విషయం(సంఘం)పై ఎలాంటి ఫిర్యాదు అంద లేదన్నారు. ప్రజావాణికి వచ్చిన వారికి న్యా యం చేయాల్సిన అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తుంది. అధికారులు మామూళ్ల మత్తు లో తూగుతుండటం వల్లనే పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి.
ఆడిట్ లేకుండానే రెన్యూవల్
ఎలా చేస్తున్నారు..?
మంచిర్యాల జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాటగ మారిం ది. మామూళ్లకు అలవాటు పడిన అధికారులు ఎలాంటి నియమనిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనడానికి మంచిర్యాలలోని రిజిస్టర్డ్ ప్రాథ మిక కల్లు గీత పారిశ్రామిక సహకార సం ఘంను పరిశీలిస్తే అర్థమవుతుంది. 2015 నుంచి ఇప్పటి వరకు ఈ సంఘానికి ఆడిట్ జరుగలేదని చెబుతుంటే.., ఆడిట్ చేయని సంఘానికి ఎక్సైజ్ అధికారులు ఎలా ఆడిట్ చేస్తున్నారు..? ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారు..? ప్రసిడెంట్, వైస్ ప్రసిడెంట్, ముగ్గురు డైరెక్టర్ల పేర్లను ఎలా అధికారికంగా ఎక్సైజ్ అధికారులు టీసీఎస్‌లో పొందుపర్చారో వారికే తెలియాలి. ఆడిట్ జరుగకుండా ఫైవ్ మెన్ కమిటీని ప్రకటించారో వారికే తెలియాలి.
దృష్టి సారించని జిల్లా అధికారులు, నాయకులు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 50 ఏండ్ల సొసైటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై అటు జిల్లా బాస్‌తో జిల్లా అధికారులు, ఇటు నియోజక వర్గ బాస్ దృష్టి సారించడం లేదని సంఘ సభ్యులు బాహాటంగా మాట్లాడుకుంటున్నారు. లక్షల సొమ్ము కొంద రు మింగుతూ, వేలల్లో సభ్యులకు ఇస్తూ కాలం వెల్లదీస్తున్న వారిపై ఎందుకు దృష్టి సారించడం లేదని చర్చించుకుంటున్నారు. ప్రజావాణి ఫిర్యాదులపై జిల్లా బాస్ సైతం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులు ఎన్ని వచ్చాయి, ఎన్ని పరిష్కారమయ్యాయి, బాధితుడికి న్యాయం జరిగిందా..? అనే వాటిపై ఫాలో అప్ చేయక పోవడంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతుంది. మరోవైపు నియోజక వర్గ బాస్ దృష్టికి ఈ సమస్య చేరిందా! లేదా..! అనేదానిపై సభ్యులు గుసగుసలాడుతున్నారు. చీమ చిటుక్కుమన్నా వాకబు చేసే బాస్ ఎందుకు పట్టించుకోవడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నియోజక వర్గంలో ఎవరికి అన్యాయం జరిగినా ముందుండి పరిష్కరించే నాయకుడి పిలుపు కోసం సంఘ సభ్యులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు అధికారులు చూపెడుతున్న నిర్లక్ష్యంపై కూడా గోడు వెల్లబోసుకోనున్నట్లు తెలిసింది.