calender_icon.png 29 August, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పొంగిన గోదావరి..మానేరు ఉగ్రరూపం

29-08-2025 02:54:44 AM

  1. నర్మాల ప్రాజెక్టు వద్ద రెస్క్యూ ఆపరేషన్: ఏడుగురు సురక్షితం
  2. గోలివాడ పంప్హౌజ్, ఎల్లంపల్లి ప్రాజెక్టులను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  3. భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
  4. ప్రధాన ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు 
  5. ఎల్లంపల్లిలోకి 8లక్షలకుపైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో... అదేస్థాయి దిగువకు విడుదల

కరీంనగర్/సిరిసిల్ల/పెద్దపల్లి, ఆగస్ట్28(విజయక్రాంతి): రెండు రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షా లు జనజీవనం స్తంభించిపోయింది. వాగు లు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, చె రువులు మత్తడి దూకుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ పరిస్థితిని సమీక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఎల్లంపల్లి పరివాహక ప్రాంతాలను పరిశీలించారు.

కేంద్ర సహాయ మంత్రి బండి సంజరు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నర్మాగ ప్రాజెక్టు వద్ద, రా ష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ధర్మపురి గోదావరి పరివాహక ప్రాం తాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్ర బి సి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాథ్ నుండి అధికారులను అప్రమత్తం చేశారు.నర్మాల ప్రాజెక్టు వరద లో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్‌ఎఫ్ ఎస్ జి ఆర్ ఎఫ్ బందాలు సంయుక్తంగా రంగంలో కి దిగి రక్షించాయి.

ప్రజలను అప్రమత్తం చే సేందుకు అధికారులు నిరంతరం కషి చేశా రు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు దగ్గర వరద నీటిలో చిక్కుకున్న ఏడుగురు పశువుల కాపర్లను రక్షించేందుకు జిల్లా యంత్రాంగం, ఎన్డీఆర్‌ఎఫ్ బందం అద్భుతమైన కషి చేశా యి. బుధవారం సాయంత్రం పశువుల మే పేందుకు వెళ్లి వరదలో చిక్కుకున్న వీరికి రా త్రి డ్రోన్ ల ద్వారా ఆహారాన్ని అందించారు.

ఆ తర్వాత, గురువారం హకీంపేట నుంచి రప్పించిన హెలికాప్టర్ల సహాయంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ రె స్క్యూ ఆపరేషన్ను కేంద్ర మంత్రి బండి సం జరు, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, స్థానిక నాయకులు పర్యవేక్షించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితేల సమర్థవంతమైన సహాయక చర్యలను కేంద్ర మంత్రి బండి సంజరు ప్రత్యేకంగా అభినందించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు జలకళతో కళకళలాడుతున్నా యి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు, ఎగు వ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల నుంచి వచ్చే వ రదతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండి, గే ట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నా రు. అలాగే, మధ్య మానేరు, దిగువ మానేరు (ఎల్‌ఎమ్డీ), ఎగువ మానేరు ప్రాజెక్టులు కూ డా పూర్తిస్థాయి నీటిమట్టానికి దగ్గరగా చేరుకున్నాయి.

గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడు దల చేస్తూ, ప్రాజెక్టుల్లోకి వస్తున్న వరదను క్రమబద్ధీకరిస్తున్నారు.శ్రీపాద ఎల్లంపల్లి ప్రా జెక్టులోకి రికార్డుస్థాయిలో వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20. 175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 15.52 టీ ఎంసీల నీరు నిల్వ ఉంది. ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సుమారు 3 లక్షల క్యూసెక్కులు, కడెం నుంచి 40 వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది.

ఈ ప్రాజెక్టు మొత్తం 62 గేట్లకుగాను, 40 గేట్లు ఎత్తి దిగువకు 8 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నా రు.మధ్యమానేరు ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయి నీటిమట్టానికి దగ్గరగా చేరుకుంది. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 20.261 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గాయత్రి పంప్హౌజ్, ఎస్సారెస్పీ కాలువ, మానేరు, ములవాగుల నుం చి వరద నీరు వచ్చి చేరుతోంది. మొత్తంగా 62,830 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది.

ప్రాజెక్టులో ఉన్న 25 గేట్లలో 17 గే ట్లు ఎత్తి దిగువకు 23,280 క్యూసెక్కుల నీటి ని ఎల్‌ఎమ్డీకి వదులుతున్నారు. అలాగే, ప్యా కేజీ-10 ద్వారా 9,600 క్యూసెక్కుల నీటిని అంతగిరి ప్రాజెక్టుకు తరలిస్తున్నారు.దిగువ మానేరు జలాశయం (ఎల్‌ఎమ్డీ) పూర్తిస్థా యి నీటిమట్టం 24.034 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 15.652 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మోయతుమ్మెద, మానేరు వాగుల నుంచి, అలాగే ఎగువన మధ్యమానేరు నుం చి వచ్చే వరదతో ప్రాజెక్టులోకి మొత్తం 55,829 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.

ఎగువ మానేరు ప్రాజెక్టులోకి వస్తు న్న 85,446 క్యూసెక్కుల వరదను అదే స్థా యిలో దిగువకు విడుదల చేస్తున్నారు.రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమా ర్ కూడా జగిత్యాల జిల్లాలో పర్యటించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రధానంగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల గోదావరికి భారీ వరద వస్తున్నందున, తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల/ధర్మపురి, ఆగస్ట్28(విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలో బుధవారం నుం డి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సం క్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.అధికారులు ఎక్కడ ఎలాంటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు సత్వరమే స్పందించాలని ఆదేశించారు. ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వస్తున్న భారీ వరద దృ ష్ట్యా గురువారం ధర్మపురి గోదావరి నది, ధర్మపురి మండలం నేరెళ్లలో లో జగిత్యాల మండలం అనంతారం బ్రిడ్జి రాయికల్ మం డలం రామోజీపేట బ్రిడ్జి ఇటిక్యాలలో లో లెవెల్ బ్రిడ్జి ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆ యా ప్రాంతాల్లో ప్రజలను అలర్ట్గా ఉంచాల ని అధికారులకు సూచించారు. ముందు జా గ్రత్తగా చెప్పడాల్సిన చర్లపై మంత్రి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎస్ ఆర్ ఎస్ పి నుండి 39 గేట్లు నుండి.నీటిని గోదావరి నదిలోకి వదిలారనీ పేర్కొన్నారు. కడెం ప్రాజెక్టు నుండి 6 గేట్ల ద్వారా గోదావరి నదిలోకి నీటిని వదిలారనీ, గోదావరి నది భారీగా నీటి ప్రవాహం వస్తున్నందున గోదావరి నది తీర ప్రాంతాలలో లోతంటూ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తం గా ఉండాలనీ సూచనలు చేశారు.

వరద ప్రాంతాలలో పర్యటించిన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్

మెట్ పల్లి, ఆగస్టు 28(విజయ క్రాంతి) కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్ధండి మరియు ఫ కీర్ కొండాపూర్ గ్రామాల్లో గురువారం కో రుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ పర్యటించి వరద ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రా ష్టంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో కోరుట్ల నియోజకవర్గ ప్రజలు అప్ర మత్తంగా ఉంటూ పాత శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని ఏ దైనా అవసరం ఉంటే తనకు కాల్ చేయలని అన్నారు.

అలాగే ఏ ప్రాంతంలో అయిన వరద నీటితో ఇబ్బందులు ఎదురు అయితే మీ మండల రెవెన్యూ అధికారి కార్యాలయా న్ని సంప్రదిస్తే వారు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి మీకు కావలసిన సౌకర్యాలను కల్పిస్తారని తెలిపారు.ఎర్ధండి గోదావరి ఎ క్కువగా ప్రవహిస్తునందువల్ల రైతులు వా గులు, వంకలు చెరువులు మరియు గోదావ రి పరిసరాలకు దూరంగా ఉండలని వర్షాలు తగ్గే వరకు మోటార్ల వద్దకు వెళ్లకుండా ఉం డడం మంచిదని తెలిపారు.వినాయక మండపాల వద్ద మండలి సభ్యులు విద్యుత్ వైర్లతో జాగ్రత్తగా ఉండలని అన్నారు. 

 భారీ వర్షాల దృశ్య మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :  కేశపట్నం ఎస్త్స్ర శేఖర్ రెడ్డి.

 గత రెండు రోజుల నుండి వర్షాలు కురుస్తుండడంతో మండల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని తెలిపారు. అరకండ్ల వాగు ని ఎస్ ఐ శేఖర్ రెడ్డి గురువారం సందర్శించా రు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని, చ ల్లూరు,కేశపట్నం రహదారి మూసివేసామని వాహనదారులు, రైతులు సహకరించాలని కోరారు. ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప మండల ప్రజలు బయటకు రావద్దని కోరా రు. అత్యవసర సమయంలో 100 కు డయల్ చేయాలని కోరారు.

ఎల్ ఎం డి కి పెరిగిన వరద అప్రమత్తం చేసిన అధికారులు

కరీంనగర్, ఆగస్ట్28(విజయక్రాంతి): కరీంనగర్ లోయర్ మానేరు జలాశయాన్ని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సందర్శించారు. డ్యాములోకి వస్తున్న వరద ప్రవాహం వివరాలు తెలుసుకున్నారు. ఇన్ ఫ్లో 55 వేల క్యూసెక్కులు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తూ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చే యాలని ఆదేశించారు. జిల్లాలోని కుంటలు, చెరువుల పరిస్థితిని సమీక్షించాలని, ప్రమాద అవకాశాలను గుర్తించి అప్రమత్తం కావాలని అన్నారు. అనంతరం మానకొండూరు చెరువును పరిశీలించారు.

--ఎల్ ఎం డి 15.652 టి ఎం సి 

---- దిగువ మానేరు జలాశయంలోకి 55 వేల 829 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. డ్యామ్ కెపాసిటీ 24.034 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.652 టీఎంసీల నిల్వ ఉంది. 920 అడుగులకు గాను నీటిమట్టం 909.10కి చేరింది. వివిధ అవసరాల కోసం 269 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.