calender_icon.png 29 August, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌లో చేరిన 80 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు

29-08-2025 03:59:51 AM

బాన్సువాడ ఆగస్టు 28 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం కు చెందిన 80 మంది కాంగ్రెస్ బిజెపి పార్టీ నాయకులు మాజీ ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలోకి చేరారు. గురువారం బాన్సువాడ పట్టణంలోనీ ఎస్ ఎం బి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా  మాజీ ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. నసురుల్లాబాద్, మైలారం, నెమలి, రాముల గుట్ట నాచుపల్లి, అంకోల్ గ్రామాల నుండి 80 మంది కాంగ్రెస్ బిజెపి నాయకులు చేరడం జరిగింది. వీరికి బాజిరెడ్డి గోవర్ధ న్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలని ప్రతి కార్యకర్త నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫలాలను ఎండగట్టి ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన సూచించారు.

చేరిన వారిలో మామిడి భూమయ్య ఎస్సీ సెల్ మాజీ మండల అధ్యక్షుడు  మెక్కా సాయి పెరక కృష్ణ రాజు సంతోష్ గంగారం సాయిలు అక్కుతార్ తో పాటు పలువురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ నాయకులు మోచి గణేష్ సాయిబాబా  నరసింహులు గౌడ్ టేకుర్ల సాయి  అల్లం రాములు   శేఖర్ దొంతి భాస్కర్  పోచయ్య సాయిలు తదితరులు పాల్గొన్నారు.