calender_icon.png 29 August, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్-వాడి రైల్వే లైన్‌కు 5,012 కోట్లు

29-08-2025 02:19:51 AM

  1. కేంద్రం గ్రీన్ సిగ్నల్
  2. దేశంలో నాలుగు రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం
  3.   565 కిలో మీటర్ల మేర విస్తరించనున్న రైల్వే నెట్‌వర్క్

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాం తి):  తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య రైల్వే కనెక్టివిటీని గణనీయంగా పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సికిందరాబాద్ నుంచి వాడి  వరకు 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.5,012 కోట్లను కేటాయించనుంది. తెలంగాణ, కర్ణాటక, బీహార్, అస్సాం రాష్ట్రాలకు ప్రయోజ నం చేకూర్చే 3 మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు లు, గుజరాత్ కచ్‌చలోని సుదూర ప్రాంతాలను అనుసంధానించడానికి ఒక నూతన రైలు మార్గాన్ని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) గురువారం ఆమోదించింది.

రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్‌కు అదనంగా 565 రూట్ కిలో మీటర్లు  జోడించడంతో బొగ్గు, సిమెంట్, క్లింకర్, ఫ్లు-యాష్, స్టీల్, కంటైనర్లు, ఎరువులు, వ్యవసాయ వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తులు మొదలైన వాటి రవాణాకు ప్రోత్సాహం లభిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం రూ.12,328 కోట్ల అంచనా వ్యయంతో ఈ రైల్వే ప్రాజెక్టులను ఆమోదించింది. వాటిలో సికింద్రాబాద్- వాడి మధ్య కీలకమైన 3వ, 4వ రైల్వే లైన్ కూడా ఉంది. 

సిమెంట్ పరిశ్రమకు ఉపయుక్తంగా...

తెలంగాణ, కర్ణాటక పరిధిలో ఉన్న సికింద్రాబాద్- వాడి  మధ్య ఉన్న 173  కి.మీ పొడవైన రైల్వే మార్గం వెంట 3వ, 4 వ లైన్ పూర్తి చేయడానికి ఐదేళ్ల కాల వ్యవధి, రూ. 5012 కోట్ల మేర నిధులు ఖర్చు కానున్నా యి. ఈ మార్గంలో సనత్‌నగర్-- హఫీజ్‌పే ట మధ్య 3 వ లైన్ నిర్మాణం, హఫీజ్‌పేట-- వాడి మధ్య 3 వ, 4 వ లైన్ నిర్మాణం ఉం టుంది . ఈ లైన్ సిమెంట్ పరిశ్రమలు, థర్మ ల్ పవర్ ప్లాంట్లకు ప్రయోజనకారిగా ఉం టూ సిమెంట్, క్లింకర్ రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది.

తద్వారా సిమెంట్ పరిశ్రమ ఉత్పత్తిని పెంచడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సుమారు 226 హెక్టార్ల భూమి అవసరమవుతుంది. కొత్త రై ళ్లు, సరుకు రవాణా ద్వారా కొత్త రైలు మా ర్గంలో అదనపు రవాణాను పెంపొందించడంతో పాటు అదనపు ఆదాయాన్ని పెం పొందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. రైళ్ల సమయపాలన మరింత మెరుగుపడుతుంది.