29-08-2025 02:23:13 AM
6న కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిక
గద్వాల, ఆగస్టు 28 (విజయక్రాంతి): గద్వాల మున్సిపాలిటీ తాజామాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ కౌన్సిలర్లు, వివిధ మండలాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు సైతం హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు. వచ్చేనెల 6న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్టు ప్రకటన కేశవ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన గద్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బీసీలతో పాటు యావత్తు తెలంగాణకు తీరని ద్రోహం చేసిందని ఆరోపించారు.
రైతులు, వివిధ వర్గాలు కాంగ్రెస్ సర్కార్ పాలనను అసహ్యించుకుంటున్నారని వాపోయారు. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్‌లో ఆత్మగౌరవం చంపుకొని కొనసాగలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం చిత్తశుద్ధితో తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.