calender_icon.png 29 August, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందని వేతనాలు!

29-08-2025 03:56:27 AM

విడుదలకాని జూన్, జూలై నెల జీతాలు 

ఈనెల పూర్తికావొస్తున్నా ఖాతాల్లో పడని వేతనాలు

  1. ఆర్థిక ఇబ్బందుల్లో డీఎస్సీ-2008 కాంట్రాక్ట్ టీచర్లు
  2.   1,225 మందికి జారీ కాని రీఎంగేజ్ ఉత్తర్వులు 
  3. అనధికారికంగా విధుల్లో కొనసాగింపు

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి ): ఇచ్చేది చాలీచాలని జీతాలు. అవి కూడా సమయానికి ఇవ్వకుంటే జీవనం సాగించేది ఎలా అని కాంట్రాక్ట్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2008-డీఎస్సీ కాంట్రాక్ట్ టీచర్లకు జూన్ నుంచి ఇంతవరకు వేతనాలు అందలేదు. జూన్, జూలై రెండు నెలలతోపాటు ఈనెల గడిస్తే మూడు నెలల వేతనం రావాల్సి ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలోనైతే ఫిబ్రవరి నుంచి జీతాలు జమ కాని వైనం.

ఆయా జిలాల్లో ఇంతవరకు వేతనాల విడుదలపై స్పష్టతేలేదు. అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేగాని జమకావని చెప్తుండడం గమనార్హం. నే డు, రేపు అంటూ అధికారులు సమాధానా లు చెప్తున్నారేగానీ తమకు మాత్రం జీతాలు ఇంతవరకు బ్యాంకు ఖాతాల్లో పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా రీఎంగేజ్ ఉత్తర్వులకు, జీతాలకు లింకులు పెడుతున్నారు.

ఇతర ఉపాధ్యాయులు, ఉ ద్యోగులకు సమయానికి జీతాలు వారి వారి ఖాతాల్లో జమ చేసే అధికారులు... తమకు మాత్రం వేతనా లు ఎప్పుడందుతాయో తెలియని పరి స్థితి అని డీఎస్సీ-2008 కాంట్రాక్ట్ టీచర్లు వాపోతున్నారు. సమయానికి జీతాలందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఏ ఒక్క నెల కూడా సమయానికి వేతనా లు అందలేదని మండిపడుతున్నారు.

రీ ఎంగేజ్‌తో వేతనాలకు లింకు

2008-డీఎస్సీలో నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు సుధీర్ఘ న్యాయం పోరాటం తర్వాత విద్యాశాఖ ఈ ఏడాది ఫిబ్రవరి 14న పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని కాంట్రాక్ట్ విధానంలో సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ)గా నియమించింది. మొ త్తంగా 1,225 మందికి ఎస్జీటీలుగా ఉద్యోగాలు కల్పిస్తూ.. నెలకు రూ. 31,040 వేత నం ఖరారు చేశారు. వీరిని ఏటా విద్యాసంవత్సరం లాస్ట్ వర్కింగ్ డే రోజు ఏప్రిల్ 24న ఉద్యోగం నుంచి తొలగించి, తిరిగి జూన్ 12 (బడులు పునఃప్రారంభం) నుంచి విధుల్లోకి తీసుకుంటున్నారు. గత విద్యాసంవత్సరంలోనూ ఇదే తరహాలో ఆలస్యంగా వేతనాలు జమయ్యాయి. 

జూన్ 12 నుంచి వీరంతా విధుల్లో చేరా రు. అయితే దీనికి ముందే వీ రిని రీఎంగేజ్ (విధుల్లో కొనసాగింపు) చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇంతవరకూ రీఎంగేజ్ ఉత్తర్వులను జారీ చేయని పరిస్థితి. ఉత్తర్వులు వెలువడకపోయినా వీరిని అనధికారికంగా విధుల్లో కొన సాగిస్తున్నారు. ఈ ఉత్తర్వులు జారీ అయితేనే వీరి వేతనాలకు బిల్లులు చేయాల్సి ఉంటుంది.

జూన్ 12 నుంచి వీరిని కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వులు ఇవ్వకపోవడంపై కాం ట్రాక్ట్ టీచర్లు మండిపడుతున్నారు. మరోవైపు ‘రెగ్యులర్ విత్ సర్వీసెస్’ చేయాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. 2008లో ఉద్యోగాలు పొందిన వారికి ఎంతైతే జీతా లు వస్తున్నాయో తమను కూడా రెగ్యులర్ చేస్తూ అంతే జీతాలు ఇవ్వాలని కోరుతున్నా రు. అయితే ఈ కేసు కోర్టు విచారణలో ఉం దని కాంట్రాక్ట్ టీచర్లు చెబుతున్నారు.

మా బాధలు వర్ణనాతీతం

సంగారెడ్డి జిల్లాలో పనిచేసే టీచర్లకు ఫిబ్రవరి నుంచి వేతనాలు జమకాలేదు.  ఈఎంఐలు, పిల్లల ఫీజులు, ఇంటి అద్దె, నిత్యావసర సరుకులు కొనుగోలుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. న్యాయస్థానం ఆదేశాలతో ప్రభుత్వం మాకు కాంట్రాక్ట్ ఉద్యోగాలిచ్చింది. దీంతో సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. ప్రయాణానికి కూడా కనీసం డబ్బులు ఉండడంలేదు. రెగ్యులర్ విత్ సర్వీసెస్ చేయాలి. మాకు న్యాయం జరుగుతోందని ఆశతో సమయానికి జీతాలు వచ్చినా రాకున్నా విధులు నిర్వర్తిస్తున్నాం. ఈ విద్యాసంవత్సరానికి రీఎంగేజ్ ఉత్తర్వులను జారీ చేస్తూ వేతనాలను వెంటనే విడుదల చేయాలి. 

 సింగారి సంగమేశ్వర్, అసోసియేషన్ ప్రధానకార్యదర్శి

వెంటనే జీతాలు విడుదల చేయాలి 

ప్రభుత్వం వెంటనే వేతనాలను విడుదల చేయాలి. మరో రెండు రోజులైతే ఆగస్టు నెల కూడా పూర్తవుతోంది. ఇంత వరకు జూన్, జూలై జీతాలే రాలేదు. మేమంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాం. సుధీర్ఘ న్యాయ పోరాటం తర్వాత మాకు ఉద్యోగాలొచ్చాయి. అందులోనూ పదకొండు నెల లు మాత్రమే జీతాలిస్తారు. బడులకు సెలవులు కావడంతో మే నెల జీతం ఉండదు. తెలిసిన వారి దగ్గర అప్పు లు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాం. ఆర్థిక శాఖ వద్ద దస్త్రం పెండింగ్‌లో ఉందని అధికారులంటున్నారు. వా రి నుంచి అప్రూవల్ వస్తే గాని సమ స్య పరిష్కారమవదు. రీఎంగేజ్ ఉత్తర్వులొస్తే గానీ జీతాలు జమయ్యే పరిస్థితి లేదు.

 ఉమామహేశ్వర్‌రెడ్డి, 

2008 డీఎస్సీ కాంట్రాక్ట్ టీచర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు