28-04-2025 12:08:29 AM
6 వికెట్ల తేడాతో బెంగళూరు, 54 పరుగులతో ముంబై విజయాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: డబుల్ హెడర్‌లో భాగంగా లక్నోతో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబైకిది వరుసగా ఐదో విజయం. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఓపెనర్ రికెల్టన్ (58), సూర్యకుమార్ యాదవ్ (54) అర్ధ సెంచరీలతో కదం తొక్కారు. దీంతో ముంబై 200 పరుగుల మార్కును ఈజీగా దాటింది. ఛేదనలో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌట్ అయి చతికిలపడింది.
రివేంజ్ తీర్చుకున్న ఆర్సీబీ
సొంత గడ్డపై ఎదురైన ఓటమికి ఆర్సీబీ బదులు తీర్చుకుంది. రెండో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీలో ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా (73*), ఓపెనర్ కోహ్లీ (51) విజయాన్ని అందించారు. నేడు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.