11 August, 2026 | 1:40 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

24-06-2025 01:12 PM

స్థానిక సంస్థలు ఎన్నికల అంటే భయపడుతున్న కాంగ్రెస్...

వనపర్తి:  కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు కే.మాణిక్యం, రైతు సమితి అధ్యక్షులు నరసింహ, డేగ మహేశ్వర్ రెడ్డి, చిట్యాల రాములు అన్నారు.  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల నాయకులు మంగళవారం దత్తాయిపల్లె, చందాపూర్, సవాయిగూడెం గ్రామాలలో పర్యటించి నాయకులను,ప్రజలను స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు... కోర్టు మొట్టికాయలు వేసిన రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇచ్చిందని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు  తదితరులు పాల్గొన్నారు.