10-01-2026 12:00:00 AM
ఆచార్య మసన చెన్నప్ప :
ప్రవాసాంధ్రులలో కవిత్వం పట ్లప్రేమగల వారిలో యెల్ది చెప్పుకోదగినవాడు. నాకు ఆయన వల్లనే సంగలేని రవీంద్రతో పరిచయం కలిగింది. నేను ఎప్పుడు వచ్చినా జింఖానాలోని ‘ఆంధ్ర మహాసభ’లో వసతి లభించేది. నేనున్నన్ని రోజులు యెల్ది నా పక్కనే ఉండేవాడు.
అతడు ఒక విలక్షణమైన మనిషి. ఆ యన పూర్వీకులెప్పుడో నిజామాబాదు నుంచి బొంబాయికి వచ్చారు. బ్రతు కుదెరువు కోసమే అతని తల్లిదండ్రులు వ చ్చి బొంబాయి మహానగరంలో స్థిరపడినారు. ఇంతకతడెవరో కాదు, యెల్ది సుదర్శ న్ గారు. బొంబాయి సినారెగా ప్రసిద్ధుడయ్యాడు. ఆయన రచించిన యెల్ది ముత్యా లు, యెల్ది రత్నాలు మొదలైన కవితా సంపుటులు హైదరాబాదులోనే ఆవిష్కృతమ య్యాయి. యెల్ది సుదర్శన్ గారికి సినారె అంటే చెప్పలేనంత అభిమానం.
సినారె బొంబాయికి వస్తే యెల్ది.. సినారెతోనే తన పుస్తకాలను ఆవిష్కరింపజేస్తాడు. తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షలుగా సినారె ఉన్న సమయంలో యెల్ది చాలాసార్లు హైదరాబా దు రావడం నేను ప్రత్యక్షంగా చూశాను. యె ల్ది బొంబాయిలో వజ్రాల వ్యాపారాన్ని ఆరంభించి బాగానే సంపాదించాడు. పద్మశాలి వంశంలో జన్మించిన తనకు ఇతర ప ద్మశాలి కవులంటే అంతులేని ప్రేమ. అతడే పుస్తకాన్ని హైదరాబాదులో ఆవిష్కరించినా మేమంతా అతని కార్యక్రమానికి తప్పకపోవలసిందే.
యెల్ది వజ్రాల వ్యాపారి అయినా కవితా రచనలో వజ్ర సంకల్పుడు. అతడు ప్రతిరోజు ఒక కవిత రాసి వాట్సాప్‌లో కవి మిత్రులకు పంపుతాడు. సినారెకు కూడా పంపుతాడు. సినారె సూచనలను గ్రహించి యెల్ది బొంబాయి సినారెగా కొనియాడబడినాడు. యెల్ది డబ్బు కోసం చూసేవాడుకా డు. అతడెప్పుడు వచ్చినా హైదరాబాదులో దిగడానికి ఒక లాడ్జిలో రూం పర్మినెంటుగా ఉంటుంది.
రవీంద్రతో పరిచయం..
ప్రవాసాంధ్రులలో కవిత్వం పట ్లప్రేమగల వారిలో యెల్ది చెప్పుకోదగినవాడు. నాకు ఆయన వల్లనే సంగలేని రవీంద్రతో పరిచయం కలిగింది. నేను ఎప్పుడు వచ్చినా జింఖానాలోని ‘ఆంధ్ర మహాసభ’లో వసతి లభించేది. నేనున్నన్ని రోజులు యెల్ది నా పక్కనే ఉండేవాడు. వయస్సులో పెద్దవాడైనా మనస్సులో ఒక శిశువుగా కనిపించే వాడు. నాకు బొంబాయి నగరంలోని గణేశ్ టెంపుల్, మహాలక్ష్మి టెంపుల్, తాజ్‌మహల్ హోటల్ మొదలైన వాటిని చూపించినవాడు యెల్ది సుదర్శనే.
అతని వల్లే నేను బొంబాయికి వెళ్లినప్పుడల్లా, కొన్ని పాఠశాలలకు వెళ్లి ఉపన్యసించేవాణ్ణి. ఆయన నాకు బొంబాయి మిఠాయి రూపంలో సంతోషాన్ని కలిగించేవాడు. తెలుగు భాషలో బొం బాయి యాస కనిపించేది. అతడెంతటి సహృదయుడంటే నాకు చెప్పకుండానే ఒక నవలను అంకితం చేశాడు. మరి అంతటితో ఆగక ‘నాకెప్పుడు మీ పుస్తకం అంకితం ఇస్తారు?’ అని అడిగేవాడు. నిజంగా అతని మనస్సులో ఏమాత్రం ఈర్ష్య, ద్వేషం, గర్వం, అసహనం కనిపించేవి కావు.
కవిత్వమంటే ప్రాణం..
ఆయన కోరికను మన్నిస్తూ నేను ‘శ్రీరామకథాగేయం’ అనే గేయకృతిని ఆయనకు అంకితం చేశాను. ఆ సభ పద్మారావునగర్‌లోని శివానందశ్రమంలో జరిగింది. అతని తో పాటు భోగ సహదేవ్ వచ్చాడు. ఇద్దరికీ సన్మానం చేశాను. యెల్ది సుదర్శన్, భోగ సహదేవ్‌గార్లిద్దరూ మంచి స్నేహితులు. యెల్దిగారి వల్లనే సహదేవ్‌గారికి నేను రచించిన ‘మోక్ష సాధనలో దశోపనిషత్తులు’ అనే గ్రంథాన్ని అంకితం చేశాను. ఆ కార్యక్రమం జరిగినప్పటి నుంచి భోగ సహదేవ్ నాకు అత్యంత ఆత్మీయుడయ్యాడు.
యెల్దికి వీలు కానప్పుడు సహదేవ్‌గారే నాకు ఆంధ్ర మహాసభలో వసతి ఏర్పాటు చేసేవారు. యెల్దికి కవిత్వం అంటే ప్రాణం, అదే సమయంలో తాను కవిగా అందరికీ తెలియాలని ప్రచా రం కూడా చేసుకుంటాడు. బహుశా నాకు తెలిసినంత వరకు డా.రాధశ్రీ తర్వాత, యెల్ది కి మాత్రమే ప్రతిరోజు కవితలు రాసే అలవాటుంది. కవిత్వంలో ప్రాణం ఉందా? లేదా? అనే విషయాన్ని పక్కనబెడితే, యెల్దికి మా త్రం కవిత్వమే ప్రాణం.
అప్పటికి మల్లికార్జునరెడ్డి బొంబాయిలోనే ఉండేవాడు. అతడు కవి, వక్త. ‘బొంబాయి వన్’ పత్రికా సంపాదకుడుగా తెలుగు భాషా సాహిత్యాలకెంతో సేవ చేశాడు. ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంటులో పనిచేసినప్పటికీ, తెలుగు కవిత్వాన్ని, సాహిత్యాన్ని ఎంతో ప్రేమించే మల్లికార్జునరెడ్డి యెల్ది వల్లనే పరిచయమయ్యాడు.
ఎన్నో పురస్కారాలు..
నా రచనల్లో ఒకటి ‘ఆసందుక’. ఇది వచ న కవితా సంపుటి. ‘అది నా జ్ఞాపకాలపుట్ట- పిల్లల కోడిపెట్ట’ అని ఆసందుకను వర్ణించా ను. నా జీవితంలో నేను ఏ బహుమతిని కోరి రచన చేయలేదు. కానీ అదృష్టవశాత్తు ‘ముంబై వన్’ పత్రికా సంపాదకులు ‘ది ముంబై ఆంధ్ర మహాసభ’ ప్రాంగణంలో ‘ఆసందుక’ కవితా సంపుటికి బహుమతిని ఇ ప్పించారు. సంగలేని రవీంద్ర, యెల్ది వంటి కవుల సహకారం లభించింది.
నాకు లభించిన పురస్కారం ‘ద్వావరశెట్టి వేంకటేశ్వర సా హితీ పురస్కారం’. అది లభించిన సంవత్సరం 2011. అంతకముందు యెల్దికి, నా కు.. కోరుట్ల ‘భారతీ సాహితీ సమితి’ ఆధ్వర్యంలో వానమామలై జగన్నాథాచార్యుల పేరుతో, వానమామలై వరదాచార్యుల పేరు తో పురస్కారాలు లభించాయి.
ఆ జవాబుతో షాక్ తిన్నా!
‘ది ముంబై ఆంధ్ర మహాసభ’ తెలుగువారిచే స్థాపించబడింది. ఇది దాదర్‌కు సమీ పంలో ‘జింఖానా’లో ఉంటుంది. తెలుగు ప్రాంతాల నుంచి ఏ కవి బొంబాయికి వెళ్లి నా ‘ఆంధ్రమహాసభ’లో ఉండవలసిందే. నేను ఎన్నో పర్యాయాలు బొంబాయికి వెళ్లినాను. వీటిలో భాషా దినోత్సవాలు, పుస్తకా విష్కరణలు, సన్మాన కార్యక్రమాలుండేవి. కానీ ఈ మధ్య బొంబాయి నగరంలో జరిగిన ‘99వ వేదాంత విజ్ఞాన మహాసభలు’ తెలుగువారిలో ఎంతో ఉత్సాహాన్ని, స్ఫూర్తి ని నింపాయి.
వ్యాసాశ్రమం వారు ఏర్పాటు చేసిన ఆ సభల్లో నాకు పాల్గొనే అవకాశం లభించింది. మూడురోజులక్కడే ఉన్నాను. మొదటిరోజు నా ప్రసంగం అయ్యింది. రెం డోరోజు కూడా యెల్ది కనిపించకపోయేసరికి, అతని గురించి తెలుసుకుంటే , అతడు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడని అ వగతమయ్యింది. నేనొక మిత్రుని సహాయంతో సుదర్శన్‌గారిని దర్శించాను.
ఏను గులా కనిపించే మనిషి పూర్తిగా సన్నమయ్యాడు. పడక మీది నుంచి లేచి నడిచే పరిస్థితి లేదు. ఎంతో అవస్థకు లోనయ్యా డు. నేనడిగాను అతణ్ణి ‘ఎందుకిట్లా అయ్యిం ది?’ అని. అతడిచ్చిన సమాధానంతో నేను షాక్ తిన్నాను. ‘కవులు, రచయితలు తమ దృష్టిని ఆరోగ్యం మీద పెట్టకపోవడమే అనారోగ్యానికి కారణం’ అన్న అతని మాటలు నన్నెంతగానో ఆలోచింపజేశాయి.
వ్యాసకర్త సెల్: 9885654381