15-10-2025 12:00:00 AM
హైదరాబాద్, అక్టోబర్ 14: గచ్చిబౌలీ స్టేడియం వేదికగా జరుగుతున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో ముంబై మీటియర్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. టోర్నీ ఆరంభం నుంచీ వరుస విజయాలతో అదరగొడుతున్న ఆ జట్టు తాజాగా కొచ్చి బ్లూ స్పైకర్స్‌పై విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరు లో 3 సెట్ల తేడాతో కొచ్చిని ఓడించింది. వెటరన్ బ్లాకర్ కార్తీక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. తాజా గెలుపుతో ముంబై సెమీఫైనల్స్‌కు చేరువైంది. బెంగళూరు రెండో ప్లేస్‌లో ఉండగా.. హైదరాబాద్ హాక్స్ ఎనిమిదో ప్లేస్‌లో కొనసాగుతోంది.