calender_icon.png 16 October, 2025 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవంబర్ 16న గ్రాన్యూల్స్ గ్రీన్ హార్ట్‌ఫుల్‌నెస్ రన్

15-10-2025 12:01:38 AM

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాం తి): దేశవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందిస్తూ మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రతీ ఏడాదీ నిర్వహిస్తున్న గ్రాన్యూల్స్ ఇండియా గ్రీన్ హార్ట్‌ఫుల్‌నెస్ రన్ నాలుగో ఎడిషన్ నవంబర్ 16న జరగనుంది. ఈ రన్‌కు సం బంధించిన జెర్సీ, మెడల్‌ను ప్రిన్సిపల్ సెక్రటరీ,ఐఏఎస్ జయేష్ రంజన్, పారా అథ్లెట్ అకీరా నందన్ బానోతు ఆవిష్కరించారు. కన్హ శాంతి వనం వేదికగా  1.5, 5కె, 10కె, 21కె విభాగాల్లో రన్  నిర్వహించనున్నారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించే ఉద్దేశిస్తూ నిర్వహిస్తున్న ఇలాం టి కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగం కావాలని జయేశ్ రంజన్ పిలుపునిచ్చారు. గిఫ్ట్ ఏ ట్రీ కాన్సెప్ట్‌తో గత మూడేళ్ళుగా తాము నిర్వహిస్తున్న ఈ రన్‌కు ప్త్రీ ఏడాది అద్భుత మైన స్పందన వస్తోందని రేస్ డైరెక్టర్ సంజీవ్ డుగూర్ చెప్పారు. ఇప్పటి వరకూ 88 వేల మందికి పైగా రన్నర్లు గత మూడు ఎడిషన్లుగా పాల్గొన్నారని, 22 వేలకుపైగా మొక్కలు నాటినట్టు ఉమా చిగురుపాటి చెప్పారు. ఈ సారి 10 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు.